Thursday, January 23, 2025

అమెరికాలో సిక్కు గాయకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. సిక్కుమతానికి చెందిన రాజ్ సింగ్ అలియాస్ గోల్డీ అనే సంగీతకారుణ్ని అలబామాలో దుండగులు కాల్చి చంపారు. అతని వయసు 29 ఏళ్లు. గురుద్వారా ఎదుట రాజ్ సింగ్ నిలబడి ఉండగా దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో రాజ్ సింగ్ అక్కడికక్కడే కన్నుమూశాడు. సిక్కుల కీర్తన బృందంలో సభ్యుడిగా అతను ఏడాదిన్నరక్రితం అమెరికాకు వెళ్లాడు. అప్పటినుంచీ అమెరికాలోనే ఉంటున్నాడు.

రాజ్ సింగ్ హత్య విషయం గురుద్వారా కమిటీ ద్వారా తమకు తెలిసిందని, హత్య జరిగి ఐదు రోజులైనా ఇంతవరకూ పోస్ట్ మార్టం జరగలేదని మృతుడి బావ గుర్ దీప్ సింగ్ చెప్పారు. రాజ్ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా తండా సెహువాలా గ్రామం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News