Friday, January 10, 2025

సెమీస్‌లో సిక్కి రెడ్డి జోడీ

- Advertisement -
- Advertisement -

Sikki Reddy-Rohan Kapoor enter semifinals

హౌచి మిన్ (వియత్నాం): ప్రతిష్టాత్మకమైన వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్‌కు చెందని సిక్కి రెడ్డిరోహన్ కపూర్ జోడీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిక్కిరెడ్డి జంట 2119, 2117 తేడాతో మలేసియాకు చెందిన చంగ్ పెన్ సూన్‌చీ సీ జంటను ఓడించింది. 39 నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగిన పోరులో భారత జంట చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తొలి సెట్‌లో సిక్కి జోడీకి ప్రత్యర్థి జంట నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత జంట సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో కూడా సిక్కి రెడ్డి జోడీ పైచేయి సాధించింది. చివరి వరకు దూకుడుగా ఆడుతూ సెట్‌తోపాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News