గాంగ్టక్: ఇటీవల తన ఫేస్బుక్ పేజి హ్యాకింగ్‌కు గురయిందని, అయితే కొద్ది గంటల్లోనే దాన్ని పునరుద్ధరించినట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తులు తమంగ్ ఫేస్బుక్ పేజిలో కొన్ని వ్యతిరేక పోస్టులు ఉంచారు. ‘ఇటీవల నా ఫేస్బుక్ పేజి హ్యాకింగ్‌కు గురయింది. కొంతమంది నన్ను అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నించారు’ అని తమాంగ్ చెప్పారు. అయితే కొద్ది గంటల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను సహించబోమని, తగిన విధంగా శిక్షించడం జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి సంబంధిత అధికారులు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తన అధికారిక పేజినుంచి వచ్చే ఇలాంటి మెస్సేజిలను పట్టించుకోవద్దని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానని తమాంగ్ అన్నారు.
Sikkim CM Facebook Page Hacked