Wednesday, January 22, 2025

సొరెంగ్ చకుంగ్ సీటుకు సిక్కిం సిఎం రాజీనామా

- Advertisement -
- Advertisement -

సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ శుక్రవారం సొరెంగ్ చకుంగ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎంఎల్‌ఎగా రాజీనామా చేశారు. తన రెండవ సీటు రెనాక్‌ను అట్టిపెట్టుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామాను స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించినట్లు సిక్కిం శాసనసభ ఒక ప్రకటనలో తెలియజేసింది. తమంగ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్ల నుంచి ఎన్నికయ్యారు. సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కెఎం) అసెంబ్లీ ఎన్నికల్లో 32 నియోజకవర్గాల్లోకి 31 చోట్ల గెలిచింది.

56 ఏళ్ల ఎస్‌కెఎం అధ్యక్షుడు తమంగ్ తాను సొరెంగ్ చకుంగ్ సీటును వదులుకోనున్నట్లు ‘ఫేస్‌బుక్’ పోస్ట్‌లో తెలియజేశారు. ‘మీ శాసనసభ్యుడుగా నిజాయతీపరుడైన, విధేయుడైన పార్టీ నేత సేవ చేయడానికి వీలుగా తప్పుకోవాలని నేనునిర్ణయించుకున్నందున సొరెంగ్ చకుంగ్ నియోజకవర్గం ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను’ అని తమంగ్ ఆ పోస్ట్‌లో తెలిపారు. తమంగ్ కుమారుడు ఆదిత్య గత అసెంబ్లీలో సొరెంగ్ చకుంగ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News