Monday, December 23, 2024

సిక్కిం వరద మృతుల సంఖ్య 22

- Advertisement -
- Advertisement -

జల్పాయ్‌గురి : సిక్కింలో ఆకస్మిక వరదలకు చనిపోయిన వారి సంఖ్య 22కు చేరుకుంది. ఇప్పటికీ గల్లంతైన 103 మందికోసం గాలింపు చర్యలు ఉధృతం చేశారు. సిక్కిం వరదలలో ఏడుగురు ఆర్మీ సిబ్బంది కూడా దుర్మరణం చెందారు. అయితే ఘటన నాటి నుంచి జాడతెలియకుండా పోయిన ఆర్మీ సిబ్బంది 23 మంది వరకూ ఉండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. సిక్కిం, నార్త్ బెంగాల్‌లో తీస్తా నది పరివాహక ప్రాంతంలో గాలింపు చర్యలు సాగుతున్నాయి ఇప్పటివరకూ మృతి చెందిన 22 మందిలో 15 మంది పురుషులు,ఆరుగురు మహిళలు అని వెల్లడైంది. మరొక్కరిని గుర్తించాల్సి ఉంది. సహాయక , గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ శుక్రవారం తెలిపారు.

సహాయక బృందాలు చేరని మారుమూల ప్రాంతాలు
ఆకస్మిక వరదలతో సిక్కింలో పూర్తిగా దెబ్బతిన్న పలు మారుమూల ప్రాంతాలకు ఇన్నిరోజులు అయినా సహాయక బృందాలు చేరుకోలేదు. పలు మారుమూల వరద తాకిడి ప్రాంతాల శాటిలైట్ మ్యాపింగ్‌లో ఈ విషయం తెలిసింది. 100 హెక్టార్ల మేర మంచుశిఖరాలు విరిగిపడిన దశలో ఆకస్మిక వరదలు సంభవించి, భారీ విపత్తును తెచ్చిపెట్టాయి. పలు చోట్ల జలాశయాలకు దరిదాపుల్లోని వందలాది నివాసిత ప్రాంతాల గురించి ఇప్పటికీ అధికార యంత్రాంగానికి ఎటువంటి సమాచారం లేదని ఈ మ్యాపింగ్‌లతో తేటతెల్లం అయింది. అనేక చోట్ల చుట్టూ జలమయం అయి ఉన్న భవంతులు , బస్తీలలో జనం నానా పాట్లు పడుతున్నట్లు శాటిలైట్ మ్యాపింగ్‌ల సాయంతో కొన్ని వార్తా సంస్థలు ఫోటోలు విడుదల చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News