హైదరాబాద్: తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన ప్రక్రియను కూడా బిజెపి నేతలు అవమానించారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను కేంద్రం మంత్రులు పదే పదే అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని హరీష్ చెప్పారు. తెలంగాణ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఏడు మండలాలను, లోయర్ సీలేరు ప్రాజెక్టును రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్‌లో కలిపారన్నారు. సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాకు కేటాయించడంతో సంవత్సరానికి తెలంగాణకు వెయ్యి కోట్ల రూపాయలు నష్టపోతుందన్నారు. తెలంగాణ ఏర్పడిన నెల రోజుల్లోనే కృష్ణా జలాల్లో తమ వాటా తెలపాలని కోరామన్నారు. తెలంగాణ పునర్ విభజన చట్టం అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. సకల జనుల సమ్మె జరిగి నేటికి 11 సంవత్సరాలు పూర్తియ్యాయన్నారు.
ఆ ప్రాజెక్టు ఎపిలో… ఏడాదికి రూ.1000 కోట్లు నష్టం: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -