- Advertisement -
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ పురుషుల నెట్‌బాల్ టీమ్ రజత పతకాన్ని సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. హారాహోరీగా సాగిన ఫైనల్లో హర్యానా 78, 73 తేడాతో తెలంగాణను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ విజయం కోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న హర్యానా విజయంతో పసిడి పతకాన్ని దక్కించుకుంది.
రియాకు స్వర్ణం
మరోవైపు గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణకు శుక్రవారం తొలి స్వర్ణం లభించింది. మహిళల క్వాడ్ ప్రీ స్టయిల్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ విభాగంలో తెలంగాణకు చెందిన రియా సాబు స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే అత్యంత నిలకడైన ప్రదర్శన చేసిన రియా సాబు ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
- Advertisement -