Thursday, January 23, 2025

థాయిలాండ్ టైక్వాండో క్రీడల్లో బానోత్ వినోద్ నాయక్‌కు రజత పతకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : థాయిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ టైక్వాండో పోటీలలో పాల్గొని రజత పథకం సాధించి ఇండియాకు విచ్చేసిన బానోత్ వినోద్ నాయక్‌ను పలువురు అభినందించారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులోని బంజారా భవన్ యందు జరిగిన అభినందన కార్యక్రమంలో బంజారా శక్తి మూమెంట్ రాష్ట్ర యువజన అధ్యక్షులు మాలావత్ రవి నాయక్ , హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రమేశ్ నాయక్‌ లు ఈ మేరకు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ టైక్వాండో పోటీలలో మరింతగా రాణించి మరిన్ని పథకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా పేరును , తెలంగాణ పేరును, ఇండియా పేరును నిలబెట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ నాయక్ ,వినోద్ నాయక్, శరత్ నాయక్ లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News