Thursday, November 21, 2024

చందిప్ప బ్రహ్మసూత్ర సహిత మరకత సోమేశ్వరుడికి వెండి కవచం

- Advertisement -
- Advertisement -
స్వామి దయాకర్‌రాజు చేతుల మీదుగా అందజేసి దాత లీలావతి

హైదరాబాద్ : గ్రేటర్ సమీపంలోని శంకరపల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో నెలకొని ఉన్న బ్రహ్మసూత్ర’ సహిత సోమేశ్వర ఆలయంలో స్వామి వారికి వెండి కవచం భక్తులు బహూకరించారు. అత్యంత పవిత్రమైన మాసశివరాత్రి, ఆరుద్ర నక్షత్ర సమయాన దాతలు స్వామి వారి వెండి కచమును శివ లింగానికి ధరింప చేశారు. ఈ సందర్భంగా వెండి కవచం దాత లీలావతి మాట్లాడుతూ అత్యంతశక్తివంతమైన బ్రహ్మసూత్ర సహిత సోమేశ్వర ఆలయంలోని స్వామివారికి వెండి కవచమును అందజేసే భాగ్యం కలిగినందుకు మహా ఆనందంగా ఉందన్నారు.

చందిప్ప బ్రహ్మ సూత్రం సాహితీ మరకత సోమేశ్వరాలయ ఆలిండియా ప్రచార కమిటీ దయాకర్ రాజు స్వామివారికి వెండి కవచమును అందజేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఆమె నిర్వహించారు. ఆయా కార్యక్రమాల అనంతరం దాత లీలావతిని ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. స్వామివారి వెండి కవచమును అందజేసిన లీలావతి కుటుంబాన్ని పది కాలాలపాటు చల్లగా కాపాడాలని వేడుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సదానందంగౌడ్ పేర్కొన్నారు. అనంతరం దయాకర్‌రాజు మాట్లాడుతూ చందిప్ప శివాలయానికి రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని, రాజధాని నగరం నుంచి నిత్యం రాజకీయ, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖలు విచ్చేసి హరహర మహాదేవుడు శంకరునికి మొక్కలు చెల్లించుకుంటున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News