Friday, January 24, 2025

గోపాలపురంలో వెండి వ్యాపారి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Silver Trader commits suicide in Secunderabad

హైదరాబాద్: సికింద్రాబాద్ గోపాలపురం పరిధిలో వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని వెండి వ్యాపారి శ్రీనివాస్(40) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులతో ఆస్తి వివాదంతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. తల్లి ఆస్తి ఇవ్వకుండా వేధిస్తోందని కుమారుడు శ్రీనివాస్ ఆరోపించాడు. వీడియో తీసి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News