Sunday, June 30, 2024

జులై 1 నుంచి సిమ్ కార్డు కొత్త నిబంధనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మొబైల్ ఫోన్ కు సంబంధించిన సిమ్ కార్డు నియమాలు జులై 1 నుంచి మారనున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలకు విరుగుడుగా కొత్త నియమాలు తెస్తున్నారు. ‘సిమ్ స్వాప్’ పేరుతో ఇటీవల మోసాలు బాగా పెరిగిపోయాయి. మన ప్రమేయం లేకుండానే మన పేరు మీద మరొకరు సిమ్ కార్డును తీసుకోవడమే ‘సిమ్ స్వాపింగ్’. ఇలాంటి మోసాలకు అడ్డకట్ట వేయడానికి ‘ట్రాయ్% కీలక నిర్ణయం తీసుకుంది.

వినియోగదారుల భద్రతను పెంచుతూ జులై 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించిన నియమాలను మార్చబోతున్నారు. కొత్త నియమం ప్రకారం ఒకవేళ మీ సిమ్ కార్డు పోయినా, పాడైపోయినా వెంటనే సిమ్ తీసుకునే వీలుండదు. కాకపోతే కొత్త సిమ్ కార్డు పొందాలంటే కనీసం 7 రోజులు(వారం) వేచి చూడాల్సిందే. ఏడు రోజుల లాకింగ్ నిబంధనను అమలుచేయబోతున్నారు. ఒక సిమ్ కార్డు పోతే అదే నెంబర్ తో మరో సిమ్ కార్డు యాక్టివేట్ చేయాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

ఈ పద్ధతితో ఎవరైనా సిమ్ స్వాపింగ్ చేస్తే తెలిసిపోతుంది. మీ ప్రమేయం లేకుండా సిమ్ ఏడు రోజులపాటు డీయాక్టివేట్ గా ఉంటే సిమ్ స్వాపింగ్ గురించి తెలిసిపోతుంది.దీంతోపాటు నేరాలు తగ్గుతాయి.

సిమ్ స్వాపింగ్ నేరస్థులు మీ నెంబర్ పై కొత్త సిమ్ ను యాక్టివేట్ చేస్తుంటారు. దాంతో మీ ఓటిపిలు అన్నీ సులభంగా వారు యాక్సెస్ చేసి మీ ఖాతాలోని డబ్బును కాజేస్తుంటారు. కొత్త విధానంతో అలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చు.

SIMs

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News