Monday, January 20, 2025

సింహరాశి వారికి ఆదాయం చారణా.. ఖర్చు బారణా!

- Advertisement -
- Advertisement -

ఆదాయం : 02 వ్యయం : 14
రాజ : 02 అవమానం : 02

మఘ 1,2,3,4 పాదములు, పుబ్బ 1,2,3,4 పాదములు, ఉత్తర 1వ పాదముల యందు పుట్టిన వారు “మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు సింహరాశికి చెందినవారు.

సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు. అం తంత మాత్రంగానే గోచరిస్తున్నది. సంవత్సరం ప్రధమార్ధం కన్నా ద్వితీయార్ధం ‘మే’ తదుపరి ఆర్థిక పరమైన విషయంలో నుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చిక్కుపోయిన ధనం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులకు సంబంధించిన వి షయాలలో దూరదృష్ఠితో ఆలోచించి మారడం మంచిదని చెప్పదగిన ము ఖ్య సూచన. చేసే పనిలో అలసత్వం, సోమరిత నం ఆవరిస్తుంది. జాగురత వహించండి. గురుడు భాగ్యంలో దశమ స్థాన సంచారం వలన ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, ట్రస్టు లు గట్టి పోటీని ఎదుర్కొనవలసిన పరిస్థితి వ స్తుంది. మీ యొక్క కృషి వలన ధర్మ సిద్దాంతాల వలన సమాజంలో మీ స్థాయిని నిలబెట్టు కోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.

జీవిత ఆశాయన్ని సాధించుకోవడానికి ఎంతో కొం త ఆర్థిక లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంత వరకు మంచి ఫలితాలను అందుకుంటారు. సంసారంలో ఒడిదుడుకులు గోచరిస్తున్నా యి. కుటుంబ జీవితంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే అంశాలు తలెత్తే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒకరినొకరు అపోహలకు, అపార్ధాలకు పోకుండా సఖ్యతతో ఉండటం మేలైన విషయం. ఉన్నదానికి లేనిదానికి ఒకరినొకరు ద్వేషించుకొనే పరిస్థితి నుండి దూరంగా జరిగే అవకాశాలు తారసపడే విధంగా ప్రవర్తించవద్దు. కుటుంబ సంబంద విషయాలలో వైషమ్యం రాకుండా చూసుకోండి. అవివాహితులకు వివా హ సంబంధాలు కుదరడంలో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధ వ్య వహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వివా హం అయిన వారికి సం తాన పరంగా కొన్ని ఇ బ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సం తానానికి సంబంధించిన విషయాలో కొన్ని కఠనమైన నిర్ణయాలు అవసరమవుతాయి.

సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగు తుంది. వ్యక్తిగత వ్యాపార పరంగా, భాగస్వామ్య వ్యాపార విషయ వ్యవహారాలలో ఆర్థిక సం బంధ విషయాలలో ఎం త కట్టుదిట్టంగా ఉంటే అంత మేలు జరుగుతుం ది. బ్యాంకుల నుండి ఋ ణాలు తీసుకొని ఇల్లు, వాహనాలు కొనడం వంటివి అంత శ్రేయస్కరమైన కాలం కాదని చెప్పవచ్చును. స్థిరచరాస్థి తీసుకున్నామనే ఆనం దం కన్నా వాటిద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత పొదు పు చేద్దామనుకున్నా కూడా కొన్ని దుబరా ఖర్చులు, రహస్య దానాలు తప్పవు. అనాలోచిత నిర్ణయాలు మీకు సంకటస్థితిని కలిస్తాయి. విదేశీయానం, ఆస్పత్రులు, ఫార్మసీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక విద్య, సైకాలజిస్ట్‌లు, గోప్యతతో కూ డిన విద్యలను అభ్యసించే వారికి కొంతవరకు అనుకూలమైన కాలం. అదేవిధంగా ఛార్టెడ్ అ కౌంట్స్, క్రీడాకారులకు అనువైనకాలం. ఫార్మసీ రంగంలో మెడికల్ రిప్రజెంటివ్స్‌కి, స్టాకిస్ట్‌లకి మంచి లాభదాయకమైన కాలం. సాఫ్ట్‌వేర్ సంస్థలకు లాభాలు ఉన్నా లేనట్టుగా ఉంటారు. సాఫ్ట్‌వేర్ జాబులు చేసే వారికి అంత అనుకూల మైన కాలం కాదు అని చెప్పవచ్చును.

ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం. మీ ఆహారపు అలవాట్లులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పై అశ్రద్ద వహించకండి. చర్మ సంబంధ రుగ్మతలు, రక్త హీనత, నీరు చేరుట, చెవి గొంతు సంబందిత ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు, అస్తమా, మన:స్థి మితం లేకపోవడం మొదలైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్త వహించండి. అదే విధంగా కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కలవర పడతారు.వారి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీకు ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది.
ఆర్థికపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. డబ్బు పరంగా సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేతిలో ధనం ఉన్నప్పటికీ నిల్వ ఉండదు, నిల్వ చేయలే ని పరిస్థితి. మీ మాట దురుసుతనంతో కొన్ని ఇ బ్బందులను తెచ్చుకుంటారు. మనస్తత్వంలోమా ర్పు తెచ్చుకుంటే కుటుంబంలో ప్రశాంత జీవనం ఏర్పడి, సుఖ సంతోషాలతో జీవనం సాగుతుం ది.

ఈ సంవత్సరం నిర్మాణ సంబంధమైన వ్యా పారాలు, సొంత ఇంటి నిర్మాణ విషయాలు నత్తనడకన సాగుతాయి.ఒకరిని నమ్మి ఏపని అప్పజెప్పడం మంచిదికాదని గ్రహిస్తారు. తృణ దా న్యాలు, పండ్లు, చింత, పెసలు, అపరాలు పం డించే రైతులకు అనువైన కాలం. అదే విధంగా ఇత్తడి, కంచు, ఇనుము, లోహపు వ్యాపారస్తుల కు లాభసాటిగా ఉంటుంది. ంగారం, వెండి, వ జ్రాల వ్యాపారస్తులకు మంచి ఆర్థికపరమైన లాభాలు అర్జిస్తారు. పౌల్ట్రీ రంగం వారికి ఆశించినంత లాభాలు ఉండకపోవచ్చు. కొంత వరకు లాభాలున్నా క్రమేపీతగ్గు మోహం పడతాయి. ఈ ఏడాది ఈ రాశి వారు మహా పాశుపత ెమం, శనివారాలు వేంకటేశ్వర స్వామి వారికి అర్చనాదులు చేయడం వలన మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా ఆదిత్య హృద యం, కాలభైరవ అష్టకం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News