Sunday, December 22, 2024

గందరగోళంగా మారిన సింహాద్రి అప్పన్న దర్శనాలు

- Advertisement -
- Advertisement -

సింహాచలం: సింహాద్రి అప్పన్న ప్రొటోకాల్ దర్శనాలు ఆదివారం గందరగోళంగా మారాయి. ఒకేసారి వీఐపిలు రావడంతో భారీ తోపులాట జరిగింది. మేయర్, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు క్యూలెన్లలో నిలిచిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున సింహాద్రి అప్పన్నకు వైవీ సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సింహాచలం చందనోత్సవంలో వీవీఐపీల గందరగోళం నెలకొంది.

ప్రోటోకాల్ దర్శనాల్లో అడుగడుగునా వైఫల్యం బయటపడింది. ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. మరో వైపు ట్రస్ట్ బోర్డు సభ్యుల అసంతృప్తి బయటపడింది. గందరగోళంగా మారిన దర్శనాల కారణంగా కనీస మర్యాద లభించలేదని మహిళ సభ్యురాలు పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు క్యూలైన్లో భక్తులు గంటల తరబడి నిలవడంతో పరస్పరం గొడవలు పడుతున్నారు భక్తులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News