Sunday, December 22, 2024

క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సులభ పరిష్కారాలు ఆవిష్కరణ చేయాలి: డా. రామకృష్ణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రోజు రోజుకూ పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధి చికిత్సను సులభతరం చేసేందుకు పరిశోధనల ద్వారా పరిష్కార మార్గాల ఆవిష్కారం జరగాలని ఓయూ సెంటర్ ఫర్ ప్లాంట్ మాలిక్యూలర్ బయాలజీ (సీపీఎంబీ) సంచాలకులు డాక్టర్ రామకృష్ణ కంచ అభిప్రాయపడ్డారు. అప్లికేషన్ ఆఫ్ కంప్యూటేషనల్ టూల్స్ టు స్టడీ క్యాన్సర్ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాప్  శనివారం ముగిసింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదకర స్థాయిలో క్యాన్సర్లు పెరుగుతుండటంతో వ్యాధిని అర్థం చేసుకోవడం, నివారణ మార్గాలను గుర్తించి ఆధునిక చికిత్స మార్గాలను వినియోగించటం అవసరమన్నారు. తద్వారా సమాజంపై భారాన్ని తగ్గించేందుకు వీలుంటుందని, ఈసందర్భంగా సిపిఎంబిలో క్యాన్సర్ పై జరుగుతున్న పరిశోధనలను వివరించారు. సీపీఎంబీ చొరవతో యుజి, పిజి ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో విద్యా, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి గత 15 నెలల్లో అనేక నైపుణ్య-అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. విద్యార్థుల ఉపాధిని పొందటానికి విద్య, వైద్య సంస్థలు ముందుకు వచ్చి మరిన్ని నైపుణ్య ఆధారిత శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News