Monday, December 23, 2024

ఆది పినిశెట్టి ‘శబ్దం’లో కీలక పాత్రలో సిమ్రాన్

- Advertisement -
- Advertisement -

డాషింగ్ హీరో ఆది పినిశెట్టి మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘వైశాలి’ సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అరివళగన్‌తో కలసి ఆది పినిశెట్టి చేస్తున్న చిత్రం ‘శబ్దం’. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఎస్ బానుప్రియ శివ సహ నిర్మాత.

ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా లక్ష్మి మీనన్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలక పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ చిత్రం కోసం ప్రముఖ నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. అరుణ్ బత్మనాభన్ కెమెరా మెన్ గా పని చేస్తుండగా, స్టార్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సాబు జోసెఫ్ ఎడిటర్ గా మనోజ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News