Wednesday, January 22, 2025

దక్షిణ భారత చలన చిత్రపరిశ్రమను ప్రశంసించిన నటి సిమ్రాన్!

- Advertisement -
- Advertisement -

చెన్నై: నటి సిమ్రాన్ మళ్లీ హిందీ సినిమా ‘గుల్‌మోహర్’ తో రీఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇప్పుడు హిందీ సినిమాల్లోనే ఎక్కువ పనిచేస్తోంది. తెరపై నటీమణుల పాత్ర నేడు బలంపుంజుకున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. నటి సిమ్రాన్ రిషి బగ్గా పోషించిన పాత్రలు ఇప్పటికీ మనకు గుర్తున్నాయి. ‘తేరే మేరే సప్నే’(1996)లో ఆమె నటుడు అర్షద్ వార్సీతో కలిసి ‘ఆంక్ మారే ఓ లడ్కా…’ పాటకు డ్యాన్స్ చేసింది. దక్షిణ భారతీయ చిత్రాలలో కూడా ఆమె కొన్నేళ్లపాటు చెప్పుకోదగ్గ పాత్రలే పోషించింది. విఐపి(1997), వన్స్ మోర్(1997), వాలీ(1999), ప్రియమానవలే(2000), పార్తేన్ రసిత్తేన్(2000), కన్నతిల్ ముత్తమిట్టాల్(2002) వంటి తమిళ చిత్రాలలో గుర్తుండిపోయే పాత్రలు పోషించింది.

ప్రస్తుతం ఆమె ‘గుల్‌మోహర్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. అది డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నది. అందులో ఒకనాటి నటి షర్మీలా ఠాగూర్, మనోజ్ బాజ్‌పేయి, అమోల్ పాలేకర్ తదితరులు కూడా నటిస్తున్నారు.

నటి సిమ్రాన్‌కు ఇప్పుడు 17, 12 ఏళ్లు ఉన్న కుమారులు ఉన్నారు. ఆమె ఇప్పటికీ నటనపై తన మక్కువ చూపుతున్నారు. తమిళంలో తన మొదటి చిత్రం… ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌తో నటించడం తన అదృష్టం అని చెప్పుకుంటారామె. తాను ప్రముఖులతో నటించేందుకు అవకాశం ఇచ్చిన వారికి, దేవునికి, తన తల్లిదండ్రులకు..అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆమె ఇప్పటికే సినీ రంగంలో 25 ఏళ్లు పనిచేసింది. పురుషుడైనా, మహిళ అయినా ఎవరి కంటే మరొకరు గొప్ప కాదంటారామె. నేడు సినిమా రంగం ప్రగతి పథంలో దూసుకెళుతోందంటారామె. తనకు దక్షిణ చిత్ర పరిశ్రమ అంటేనే ఎక్కువ మక్కువ అన్నారామె. హిందీ సినిమా పరిశ్రమ పనితీరు చాలా భిన్నంగా ఉంటుందన్నారు. దర్శకుడు మణిరత్నం గారితో పనిచేయడం తనకు చాలా తృప్తినిచ్చిందన్నారు. ఆయన టెక్నిషియన్స్ కూడా గొప్పగా ఉంటారని తెలిపింది సిమ్రాన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News