హైదరాబాద్ : నగరంలోని అపోలో ఆసుపత్రి వైద్యులు డా. ఆళ్ల గోపాల కృష్ణగోఖలే నేతృత్వంలో వైద్య బృందం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 25 సంవత్సరాల మహిళను కాపాడటానికి అరుదైన గుండె, ఊపిరితితుత్తుల మార్పిడిని ఒకేసారి విజయవంతంగా నిర్వహించారు. అవయవ గ్రహీత దురదృష్టవశాత్తు పుట్టకతోనే ఏర్పడే గుండె జబ్బు, వెంట్రిక్యులర్ సెప్టల్‌గా పిలువబడే గుండెలో ఏర్పడిన రంద్రం లోపంతో గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు మధ్య అసాధారణ సంబంధం కాగ్నిటల్ హార్ట్ డిసీజ్‌తో ఆమె బాధపడుతున్నది. గుండె వైఫల్య కారణంగా అనేకసార్లు ఆమెను వివిధ ఆసుపత్రుల్లో చేర్చించారు. నగరంలో అపోలో అవయవ మార్పిడి బృందం ఆమెకు వైద్య పరీక్షలను నిర్వహించి ఆమె ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడంతో గుండె వైఫల్యం జరిగి ఆమె చివరి దశలో ఉన్నదని నిర్దారించారు. ఆమె ప్రాణాలను కాపాడటానికి గుండె, ఊపిరితిత్తుల మార్పిడి ఒకటే పరిష్కారమని ట్రాన్స్ ప్లాంట్ బృందం రోగి సహాయకులకు సూచించి చికిత్స చేసినట్లు తెలిపారు.