Tuesday, January 21, 2025

రైతుల పక్షాన హరీష్ రావు డిమాండ్

- Advertisement -
- Advertisement -

అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేం ప్రజల పక్షాన నిలబడతామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. రైతాంగమంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకోకండి, బోనస్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, రూ.500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. తుపాన్ కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిసాయని, వాళ్ళను ఆదుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చాక రైతుబంధు కింద ఎకరాకి రూ.15,000 డిసెంబర్ 9వ ఇస్తామని చెప్పారు. ఎప్పుడు రైతుబంధు ఇస్తారో చెప్పాలని రైతుల పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News