Monday, January 20, 2025

జనవరి 26న సిందూరం థియేటర్స్ లో విడుదల

- Advertisement -
- Advertisement -

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sindhooram in theaters from January 26ఈ సందర్భంగా దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి మాట్లాడుతూ… సిందూరం అలరిస్తుందని ఆశిస్తున్నాను. నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హై ఇంటెన్షన్ సిందూరం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు.

నిర్మాత ప్రవీణ్ రెడ్డి జంగా మాట్లాడుతూ… సిందూరం సినిమాలో నటించిన అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మంచి సినిమా తీసామనే సంతృప్తి ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తోన్న సిందూరం అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News