బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అగ్రశ్రేణి క్రీడాకారిణి సింధు జయకేతనం ఎగుర వేసింది. ఉగాండా షట్లర్ హుసినాతో జరిగిన పోరులో సింధు అలవోక విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు 2110, 219తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తన మార్క్ షాట్లతో అలరించిన సింధు ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దూకుడైన ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక సింధు జోరుకు హుసినా ఎదురు నిలువలేక పోయింది. వరుసగా రెండు సెట్లలోనూ ఓడి రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఇక సింధు సునాయాస విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు శ్రీకాంత్ జయకేతనం ఎగుర వేశాడు. శ్రీలంక షట్లర్ దుమిండు అభయ్‌విక్రమార్కతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 219, 2112 తేడాతో అలవోక విజయాన్ని అందుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన శ్రీకాంత్ వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.