Thursday, December 26, 2024

పసిడి పోరుకు సింధు

- Advertisement -
- Advertisement -

Sindhu defeated Jia Min of Singapore in semi-final

సెమీస్‌లో జియా మిన్‌పై గెలుపు

బర్మింగ్‌హామ్ : కామన్వెల్త్ గేమ్స్ 2022లో పివి సింధు పతకం ఖాయమైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు సెమీ ఫైనల్‌లో సింగపూర్‌కు చెందిన జియా మిన్‌ను ఓడించింది. తొలి గేమ్‌లో సింగపూర్ క్రీడాకారిణి నుంచి సింధుకు గట్టి సవాల్ ఎదురైనా, సింధు తన అనుభవాన్ని చక్కగా ఉపయోగించి తొలి గేమ్‌ను 21-19తో, రెండో గేమ్‌ను 21-17తో గెలిచి ఫైనల్‌లోకి ప్రవేశించింది. అంతకుముందు సెమీ ఫైనల్స్‌కు చేరేందుకు సింధు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. క్వార్టర్స్‌లో మలేషియాకు చెందిన గొ వి జిన్‌ను ఓడించింది. గోహ్ 60వ ర్యాంక్‌లో ఉన్న క్రీడాకారిణి సింధుకు చెమటలు పట్టించింది. సింధు 19-21, 21-14, 21-18 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News