బాలీ: ప్రతిష్టాత్మకమైన ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌ల పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని భావించిన ఇద్దరు కనీసం ఫైనల్‌కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. డెన్మార్క్‌కు చెందిన మూడో సీడ్ అంటోన్‌సెన్‌తో జరిగిన పోరులో శ్రీకాంత్ కంగుతిన్నాడు. ఏకపక్షంగా సాగిన సెమీస్‌లో అంటోన్‌సెన్ 2114, 219 తేడాతో శ్రీకాంత్‌ను చిత్తు చేశాడు. ప్రత్యర్థి ధాటికి భారత షట్లర్ కనీస పోటీ కూడా ఇవ్వకుండానే ఓటమి పాలయ్యాడు. ఇక మహిళల విభాగంలో సింధు పోరాటం సెమీస్‌కే పరిమితమైంది. శనివారం జరిగిన పోరులో సింధు టాప్ సీడ్ అకానె యమగూచి (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. చిరకాల ప్రత్యర్థి యమగూచితో జరిగిన సెమీస్‌లో సింధు 1321, 921 తేడాతో పరాజయం చవిచూసింది. ప్రత్యర్థికి కనీస పోటీని కూడా ఇవ్వలేక పోయిన సింధు టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది.