Tuesday, December 24, 2024

సింధు, శ్రీకాంత్ ముందంజ

- Advertisement -
- Advertisement -

కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్

సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోటీల్లో సింధు, శ్రీకాంత్‌లు జయకేతనం ఎగుర వేశారు. ఇంతకుముందే భారత యువ షట్లర్ లక్షసేన్ రెండో రౌండ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సింధు అలవోక విజయం సాధించింది. అమెరికా షట్లర్ లౌరెన్ లామ్‌తో జరిగిన పోరులో సింధు 2115, 2114 తేడాతో జయభేరి మోగించింది. ఆరంభంలో ప్రత్యర్థి లౌరెన్ నుంచి సింధుకు గట్టి పోటీ ఎదురైంది. ఆరంభంలో ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాడు. ఇటు సింధు అటు లౌరెన్ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు.

దీంతో పోరు ఆసక్తికరంగా సాగింది. కానీ కీలక సమయంలో భారత స్టార్ పుంజుకుంది. ప్రత్యర్థి ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో సింధుకు లౌరెన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరు హోరాహోరీగా పోరాడుతూ ముందుకు సాగారు. కాగా 1514 ఆధిక్యంలో ఉన్న సింధు ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొంది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన సింధు వరుసగా ఆరు పాయింట్లను సాధించింది. దీంతో వరుసగా రెండు సెట్లు గెలిచి రెండో రౌండ్‌కు దూసకెళ్లింది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ నంబర్‌వన్ శ్రీకాంత్ విజయం సాధిచాడు. మలేసియా షట్లర్ డారెన్ లియూతో జరిగిన తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 2220, 2111 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. తొలి గేమ్‌లో శ్రీకాంత్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. అయితే ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన శ్రీకాంత్ సెట్‌ను దక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లో శ్రీకాంత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ అలవోక విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపుతో శ్రీకాంత్ రెండో రౌండ్‌లో ప్రవేశించాడు. ఇజ్రాయిల్ షట్లర్ మిషా జిల్బర్మాన్‌తో శ్రీకాంత్ రెండో రౌండ్‌లో తలపడుతాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News