Wednesday, December 25, 2024

వైరల్‌గా మారిన సింధు పెళ్లి ఫొటోలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు వివాహం ఆదివారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో సింధు పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సింధు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కాగా, నిన్న హైదరాబాద్ లో వైభవంగా వీరి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News