సింగపూర్ : ఢిల్లీలో సింగపూర్ రకపు కొవిడ్ వేరియంటు ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం వివాదాస్పదం అయింది. కేజ్రీవాల్ వాదనపై సింగపూర్ అధికారికంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఈ విషయం చెప్పి ఉంటారని, భారతదేశం తరఫున కాదని వివరణ ఇచ్చారు. సింగపూర్‌లోతలెత్తిన వేరియంట్ ఢిల్లీలో కన్పించిందని, ఇది పిల్లలకు ప్రమాదకారి అని కేజ్రీవాల్ చెప్పడం అనుచితం, అవాస్తవికం అని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించింది. తీవ్రస్థాయి అంశానికి సంబంధించి ఇటువంటి బాధ్యతారాహిత్యపు ప్రకటన చేయడం ఎంత వరకు సబబు? దీనితో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందా? అని సింగపూర్ ప్రశ్నించింది. వెంటనే కేంద్ర విదేశాంగ మంత్రి తమ సమాధానంలో ఢిల్లీ సిఎం భారత ప్రభుత్వం తరఫున మాట్లాడలేదనివివరణ ఇచ్చారు.