Sunday, November 24, 2024

సింగపూర్‌లో కోవిడ్ సెకండ్ వేవ్

- Advertisement -
- Advertisement -

సింగపూర్ : ప్రపంచ వాణిజ్య కేంద్రం సింగపూర్‌లో మరోసారి కోవిడ్ ఉధృతి తలెత్తింది. కోవిడ్ 19 సెకండ్ వేవ్ నెలకొందని సింగపూర్ ఆరోగ్య మంత్రి ఒంగ్ యె కంగ్ తెలిపారు. వచ్చే కొద్ది వారాలలో అత్యధిక సంఖ్యలో జనం కోవిడ్‌కు గురి అయ్యి, ఆసుపత్రులలో చికిత్సలకు చేరాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఇప్పటి పరిస్థితి ఆందోళనకరమైనదేమీ కాదని, దీనిని సాధారణ స్థాయి అంటువ్యాధిగా పరిగణిస్తున్నామని తెలిపారు. రోజువారి కోవిడ్ కేసులు మూడు వారాల క్రితం దాదాపు వేయి వరకూ ఉండగా రెండువారాలుగా ఇవి రోజువారిగా చూస్తే రెండువేలుగా పెరిగాయని అధికారులు తెలిపారు. ఎక్స్‌బిబి ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా తలెత్తిన ఇజి.5, దీని ఉపరకం హెచ్‌కె .3 వైరస్ వల్ల ఇప్పుడు ఈ కోవిడ్ వేవ్ నెలకొంది.

లాక్‌డౌన్లు, ఇతరత్రా సామాజిక ఆంక్షలు విధించే ఆలోచనలు ఏమీ లేవని ఆరోగ్య మంత్రి తెలిపారు. కోవిడ్ ఉపవైరస్‌లతో పెద్ద ప్రమాదం ఏమీ లేదని, ఇప్పుడు తలెత్తిన వేవ్‌ను ఓ పరిమిత స్థాయి అంటువ్యాధిగా పరిగణిస్తున్నట్లు వివరించారు. దీనిని అరికట్టేందుకు సరైన పద్ధతిలో వెళ్లుతామన్నారు. వైరస్‌ల కాలంలో వీటితో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ఎవరికి వారుగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News