Friday, November 22, 2024

ప్రయాణికులను వదిలేసి సింగపూర్‌కు విమానం పయనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అమృత్‌సర్ నుంచి సింగపూర్ వెళ్లే స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం బుధవారం 35 మంది ప్రయాణికులు ఎక్కకుండానే బయల్దేరి వెళ్లిపోయింది. ఈ తప్పిదంపై దర్యాప్తునకు డైరెక్టరేట్ జనల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిసిజిఎ) దర్యాప్తునకు ఆదేశించింది. అమృత్‌సర్ విమానాశ్రయం నుంచి రాత్రి 7.55 గంటలకు బయల్దేరాల్సిన విమానం అసాయంత్రం 3 గంటలకే బయల్దేరింది. దీంతో 35 మంది ప్రయాణికులు విమానం ఎక్కలేకపోయారు.

తాము ఎక్కకుండానే విమానం వెళ్లిపోవడం పట్ల ఆగ్రహిస్తూ ఆ 35 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో నిరసన తెలిపారు. సంబంధిత అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. ప్రయాణికులు ఎక్కకుండానే విమానం వెళ్లిపోయిన సంఘటన గత వారం రోజుల్లో ఇది రెండవది. గత వారం బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే ఫస్ట్ ఫ్లైట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 50 మంది ప్రయాణికులు ఎక్కకుండానే వెళ్లిపోయింది. దీనిపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News