Sunday, January 19, 2025

సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్

- Advertisement -
- Advertisement -

సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. రెండు దశాబ్దాల పాటు ప్రధానిపదవి నిర్వహించి రాజీనామా చేసిన లీ సీన్ లూంగ్ స్థానంలో లారెన్స్ వాంగ్ బాధ్యతలు స్వీకరించారు. పూర్వపు ఉప ప్రధాని అయిన వాంగ్ బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) రాత్రి 8 గంటల తరువాత ఇస్తానా ప్రభుత్వ కార్యాలయంలో ప్రధానిగా ప్రమాణం చేశారు.

సుసంపన్న దేశమైన సింగపూర్‌కు సారథ్యం వహిస్తున్న లీ కుటుంబేతర రెండవ నేత వాంగ్. ‘చట్ట ప్రకారం, నా సామర్థం మేరకు ప్రధానిగా నా బాధ్యతలను సర్వకాల సర్వావస్థలందు నమ్మకంగా నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నా’ అని వాంగ్ తెలిపారు. వాంగ్ మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ మంత్రి సహాయకునిగా నియుక్తుడైన మాజీ ప్రధాని లీ కూడా వారిలో ఉన్నారు. వాంగ్ యుఎస్‌లో చదువుకున్న ఆర్థికవేత్త.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News