Thursday, January 23, 2025

సెమీస్‌లో సింధు

- Advertisement -
- Advertisement -

Singapore Open 2022: PV Sindhu Advances To Semis

సైనా, ప్రణయ్ ఇంటికి
సింగపూర్ ఓపెన్

సింగపూర్: ప్రతిష్టాత్మకమైన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మహిళల సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు భారత్‌కే చెందిన మరో షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ పోరాటం క్వార్టర్ ఫైనల్ దశలోనే ముగిసింది. అయితే సింధు మాత్రం టైటిల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. శుక్రవారం జరిగిన హోరాహోరీ క్వార్టర్ ఫైనల్లో సింధు 1721, 2111, 2119 తేడాతో చైనా షట్లర్ హాన్ యుయేను ఓడించింది. తొలి సెట్‌లో సింధుకు చుక్కెదురైంది. ప్రత్యర్థి హాన్ అద్భుత ఆటతో సింధును హడలెత్తించింది. ఆమె ధాటికి సింధు ఎదురు నిలువలేక పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన హాన్ అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. కానీ రెండో సెట్‌లో సింధు మళ్లీ పుంజుకుంది. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. సింధు ధాటికి హాన్ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన సింధు సునాయాసంగా సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం మళ్లీ హోరాహోరీగా మారింది.

ఈసారి సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇటు సింధు, అటు హాన్ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో సెట్ ఆసక్తికరంగా సాగింది. ఒక దశలో సింధు కాస్త ఒత్తిడికి గురైనట్టు కనిపించింది. ప్రత్యర్థి దూకుడుగా ఆడుతూ పైచేయి సాధించింది. కానీ కీలక సమయంలో భారత స్టార్ సింధు మళ్లీ పైచేయి సాధించింది. తన మార్క్ షాట్లతో హాన్‌ను హడలెత్తించింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న సింధు సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచ సెమీస్‌కు దూసుకెళ్లింది. మరోవైపు సైనా నెహ్వాల్ హోరాహోరీ క్వార్టర్ ఫైనల్ పోరులో ఓటమి చవిచూసింది. జపాన్ షట్లర్ ఒహరితో జరిగిన ఉత్కంఠ పోరులో సైనా పోరాడి ఓడింది. ఆసక్తికరంగా సాగిన మూడు సెట్ల సమరంలో ఒహరి 1321, 2115, 2220 తేడాతో సైనాను ఓడించింది. తొలి సెట్‌లో గెలిచిన సైనా ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లలో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి చవి చూశాడు. జపాన్ షట్లర్ కొడాయి నరోకాతో జరిగిన పోరులో ప్రణయ్ పరాజయం పాలయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News