- Advertisement -
సింగపూర్: నగర దేశం సింగపూర్‌లో అధ్యక్ష పదవికి ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఓట్ల లెక్కింపు పురోగతిలో ఉంది. ఇక్కడ సాగిన త్రిముఖ పోటీలో భారతీయ సంతతికి చెందిన మాజీ మంత్రి థర్మన్ షణ్ముగరత్నం విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. 2011 తరువాత జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికలు ఇవే. 2.7 మిలియన్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంతకు ముందు 2017లో జరిగిన ఎన్నికల దశలో అధ్యక్ష పదవిని మలే అభ్యర్థికే కేటాయించారు. దీనితో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాగా 2011 ఎన్నికల తరువాత పోటాపోటీగా సాగిన ఎన్నికలు ఇవే .
- Advertisement -