Friday, January 24, 2025

సింగపూర్ లో మళ్లీ కోవిడ్-19 కేసులు…కొత్త వేవ్!

- Advertisement -
- Advertisement -

సింగపూర్ లో కోవిడ్-19 సంక్రమణ కేసులు కొత్తగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ వారం అవి రెట్టింపయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. పైగా ఆయన మాస్కులు ధరించాలని ప్రజలకు హితవు పలికారు. ఈ కొత్త వేవ్ ను సింగపూర్ గమనిస్తోంది. మే మొదటి వారంలో 13700 కేసులు ఉండగా రెండో వారంలో 25900 కు కేసులు చేరుకున్నాయి.

సగటున ఆసుపత్రులలో రోజూ చేరుతున్న రోగుల సంఖ్య 181 నుంచి 250కు పెరిగింది. సింగపూర్ లో మళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని, మళ్లీ ఈ వ్యాధి జూన్ నెల కల్లా తారాస్థాయికి చేరుకుంటుందని ఓంగ్ యే కుంగ్  తెలిపారని ‘ స్ట్రెయిట్స్ టైమ్స్’ నివేదించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News