- Advertisement -
కొవిడ్ ప్రయాణ ఆంక్షలతో ప్రవాసుల సంఖ్య తగ్గుముఖం
సింగపూర్: సింగపూర్ జనాభా గతంలో ఎన్నడూ లేనివిధంగా 4.1 శాతం తగ్గింది. ఈ ఏడాది జూన్ నాటికి దేశ జనాభా 54.5 లక్షలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కొవిడ్-19 ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో ప్రవాసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. 1970లో జనాభా లెక్కల సేకరణ మొదలుపెట్టిన తర్వాత ఈ రకంగా జనాభా సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారని ప్రభుత్వం తెలిపింది. కొవిడ్ ప్రయాణ ఆంక్షలతోపాటు అస్థిరమైన ఆర్థిక వాతావరణం కారణంగా విదేశీ ఉద్యోగుల సంఖ్య తగ్గడంతో ప్రవాసుల జనాభాలో క్షీణత ఏర్పడిందని నేషనల్ పాపులేషన్ అండ్ టాలెంట్ డివిజన్ తన వార్షిక జనాభా నివేదికలో తెలిపింది. శాశ్వత నివాసులు జనాభాలో 0.7 శాతం తగ్గుదల ఉండగా ప్రవాసుల జనాభా 10.7 శాతం తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు. దాదాపు 14.7 లక్షల ప్రవాసుల జనాభా తగ్గినట్లు పేర్కొన్నారు.
- Advertisement -