- Advertisement -
సింగపూర్: భారతీయ పర్యాటకులకు ఎలాంటి అడ్డంకులు పెట్టకుండా సింగపూర్ ఆహ్వానిస్తోంది. వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్(విటిఎల్) కింద నవంబర్ 29 నుంచి వ్యాక్సిన్ పూర్తిగా వేయించుకున్న భారతీయులను క్వారెంటైన్ అవసరం లేకుండా ప్రవేశాన్ని కల్పిస్తోంది. వ్యాక్సినేటెడ్ ట్రావెల్ పాస్( విటిపి) దరఖాస్తులను నవంబర్ 22 నుంచి భారతీయ పర్యాటకుల నుంచి స్వీకరించబోతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ మధ్య జరిగిన చర్చల అనంతరం క్వారంటైన్-ఫ్రీ ట్రావెల్ పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్ ట్రావెల్ గైడ్‌లైన్స్ ప్రకారం భారతీయ పర్యాటకులు ‘కోవిన్’ వంటి వ్యాక్సిన్ యాప్ ద్వారా రుజువులు చూయించి క్వారంటైన్ మినహాయింపు పొందవచ్చు. భారత్ సైతం సింగపూర్ ఇచ్చిన వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను నవంబర్ 12 నుంచి గుర్తిస్తోంది.
- Advertisement -