Saturday, April 19, 2025

సింగరేణి సంస్థ 136 సంవత్సరాల చరిత్రలో ఇదొక మైలు రాయి:కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

సింగరేణి సంస్థ చరిత్రలో ఇదొక మైలు రాయిగా నిలిచిపోతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘136 సంవత్సరాల వారసత్వంలో మొదటిసారిగా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ వెలుపల ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. భారతదేశ ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధికి, దాని విస్తరణ, పెరుగుతున్న సహకారాన్ని సూచిస్తూ సింగరేణికి ఇది గర్వకారణమైన క్షణ’మని ఆయన ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం పోస్ట్ చేశారు. ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం సంతృప్తినిచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చొరవలో తాను భాగస్వామి అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి వెలుపల మొట్టమొదటిసారి ఒడిషాలోని నైని బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించి బొగ్గు ఉత్పత్తిని విస్తరించడం పట్ల, భారత ఇంధన లభ్యత, ఆర్థిక ప్రగతిలో నానాటికీ పెరుగుతున్న తన భాగస్వామ్యం పట్ల సింగరేణి సంస్థకు ఇది గర్వించదగిన క్షణమని హర్షం వ్యక్తం చేశారు. నైని బొగ్గు బ్లాకులో ఉత్పత్తిని ప్రారంభించటానికి ఉన్న అవరోధాలను తొలగించటానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తరపున, బొగ్గు మంత్రిత్వశాఖ తరపున అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సంస్థ అభివృద్ధిలో భాగమవ్వడం వ్యక్తిగతంగా తనకు సంతృప్తిని కలిగించిందని చెప్పారు. ఇక సింగరేణి సంస్థ తన విజయపరంపరను ఇలాగే కొనసాగించాలని, మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని కోరుకుంటూ కిషన్ రెడ్డి సింగరేణి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి సంస్థ ముందుకు సాగి మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News