Friday, November 22, 2024

సింగరేణికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

Singareni Collieries Company Limited has recorded 364% growth in profits

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా పరిస్థితులను విజయవంతంగా అధిగమించి బొగ్గు ఉత్పత్తి, రవాణా, లాభాల్లో రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు తన ట్విట్టర్, పేస్ బుక్ ఖాతాలలో సింగరేణి పురోగతిపై ప్రత్యేకంగా పోస్ట్ చేసి అభినందించారు. అలాగే సింగరేణి సాధించిన ప్రగతికి సంబంధించిన చిన్న వీడియోను కూడా తన ట్విట్టర్, పేస్ బుక్ ఖాతాలలో పొందుపరచడం విశేషం.

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే సింగరేణి 2021..20-22 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రూ.8,180 వేల కోట్లకు పైగా టర్నోవర్ తో 72శాతం వృద్ధిని సాధించడం, 364 శాతం వృద్ధితో రూ. 800 కోట్ల లాభాలను ఆర్జించడంపై కంపెనీకి ప్రహ్లాద్ జోషి అభినందనలు తెలిపారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కంపెనీ గణనీయమైన ప్రగతి సాధించడంలో కీలక పాత్ర పోషించిన కంపెనీ నాయకత్వాన్ని, ఉద్యోగులను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.రానున్న రోజుల్లోనూ ఇదే పురోగతిని కొనసాగిస్తూ దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో ముఖ్య భూమిక పోషించాలని ఆయన అభిలషించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News