Monday, December 23, 2024

మణుగూరు ఏరియాలో సింగరేణి డైరెక్టర్ల పర్యటన

- Advertisement -
- Advertisement -

మణుగూరు : సింగరేణి కాలరీస్ ఎస్‌వికే శ్రీనివాస్, డైరెక్టర్స్ ఆపరేషన్స్ జి వేంకటేశ్వరరెడ్డి డైరెక్టర్ ప్లానింగ్, ప్రాజెక్ట్ తమ అధికారిక పర్యటనలో భాగంగా మంగళవారం ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్, ఏరియా ఉన్నత అధికారులతో కలిసి ముందుకు కొండాపురం భూగర్భ గనిని సందర్శించారు. అనంతరం పడిగేరు ప్రాంతంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్మితవుతున్న జియో థర్మల్ ఫైలట్ పవర్ ప్రాజెక్ట్ ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. ఈసందర్భంగా వారు ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యులతో మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ శ్రీధర్ సారథ్యంలో సింగరేణి సంస్ధ అత్యాధునిక శాస్త్ర సాంకేతిక రంగంలోనూ తన ప్రతిభ చాటుతుంది.

శ్రీ రాం ఇన్‌స్టిట్యూట్ ఫోర్ ఇండస్ట్రియల్ రిసర్చ్ భాగస్వామ్యంలో నిర్మించనున్న ప్రయోగాత్మక జియో థర్మల్ విద్యుత్ ఉత్సత్తి కేంద్రం ద్వారా భూగర్భం నుంచి ఉబికి వచ్చే వేడి నీటి ద్వారా విద్యుత్ ఉత్పాదక ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా చేపట్టడం ద్వారా సింగరేణి మరింత గుర్తింపు వస్తుంది. ఈప్రాజెక్ట్ నిర్మాణానికి ఎస్‌టి ప్లాన్ ఆఫ్ మినిస్ట్రి ఆఫ్ కోల్ నుంచి 1.72 కోట్ల నిధులు మంజూరు కూడా చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఇతర అవసరాలకు సింగరేణి యాజమాన్యం ద్వారా పూర్తి సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం మణుగూరు ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకత, లక్ష్యాల సాధనపై బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో పూర్తి స్ధాయిలో రక్షణ పాటిస్తూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేస్తూ ఏరియాకు నిర్దేశించిన బొగ్గు, ఓబి లక్ష్యాలను సాధించుటకు తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని, అలాగే రానున్న వర్షకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్, ఏరియా ఉన్నతాధికారులతో జరిగి సమీక్షా సమావేశంలో ఇద్దరు డైరెక్టర్లు తమ సూచనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు డైరెక్టర్ పిఅండ్‌పి ఎన్ సుధాకర్‌రావు, ఎస్‌ఒటు జిఎం డి.లలిత్‌కుమార్, ఏజిఎం కేపియూజి జి నాగేశ్వరరావు, ఏరియా ఇంజనీర్ నర్సీరెడ్డి, శ్రీరామ్ ఇన్టిట్యూట్ ఫోర్ ఇండస్ట్రియల్ రిసర్చ్ సైంటిస్టు డాక్టర్ భేపేష్ శర్మ, ఈఈ ఈఅండ్‌ఎం ఏనుగల విజయ్‌పాల్, కొండాపురం సేప్టి అధికారి ఆర్ మధుబాబు, సీనియర్ సెక్యూరిటీ అధికారి అబ్దుల్ షబీరుద్దీన్, జూనియర్ సర్వే అధికారి సర్వర్ నబీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News