- Advertisement -
హైదరాబాద్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆరు జిల్లాల్లో సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి. 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు 11 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. సింగరేణి ఎన్నికల బరిలో నుంచి టిబిజికెఎస్ తప్పుకుంది. ఎఐటియుసికి టిబిజికెఎస్ మద్దతు ప్రకటించింది. ఐఎన్‌టియుసికి గట్టి పోటీ ఇచ్చేందుకు బరిలోంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సింగరేణి ఎన్నికల్లో ఎఐటియుసి, ఐఎన్‌టియుసి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
- Advertisement -