Monday, December 23, 2024

ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్

- Advertisement -
- Advertisement -

సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల పోలింగ్ ప్రశాంతంగా కొన‌సాగుతోంది. మొత్తం 11 డివిజ‌న్‌ల‌లో ఉద‌యం 7 గంట‌లకు పోలింగ్ ప్రారంభ‌మైంది. పోలింగ్ ప్ర‌క్రియ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు 23,623 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. మొత్తం 39,775 ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 13 కార్మిక సంఘాలు బ‌రిలో ఉన్నాయి. సింగ‌రేణి విస్త‌రించి ఉన్న పెద్ద‌ప‌ల్లి, మంచిర్యాల‌, ఆసిఫాబాద్, భూపాల‌ప‌ల్లి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం జిల్లాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 700 మంది సిబ్బంది ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన్నారు.
ఇక పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన అనంత‌రం ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఈరోజు రాత్రి 7 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, పూర్తయిన వెంట‌నే ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తామ‌ని సింగ‌రేణి ఎన్నిక‌ల అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News