Sunday, January 19, 2025

సింగిరేణి కార్మికులకు ఇండ్లు నిర్మించి ఇస్తాం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి: సింగరేణి కార్మికులకు ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహిళా కార్మికులకు గని లోపల కాకుండా బయట పని చేయిస్తానని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు, కొత్తగూడెంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో పొంగులేటి మాట్లాడారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంతో పాటు వైద్యానికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపడుతామని చెప్పారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలు చేపడుతామని పొంగులేటి స్పష్టం చేశారు. కార్మికులకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు రూ.20 లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని తెలిపారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసి తరుపున మంత్రి శ్రీధర్ బాబు ప్రచారం చేపట్టారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News