Wednesday, January 22, 2025

ఫిబ్రవరిలో సింగరేణి అద్భుతమైన వృద్ధి

- Advertisement -
- Advertisement -

Singareni excellent growth in February

గతేడాది కన్నా 40 శాతం వృద్ధిలో బొగ్గు రవాణా,
33 శాతం వృద్ధితో బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీతలో 20 శాతం వృద్ధి
విద్యుత్ టర్నోవర్‌లో 19 శాతం
సింగరేణి సోలార్ ద్వారా ఇప్పటికి 239 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
కార్మికుల పనితీరుపై సింగరేణి సిఎండి హర్షం

హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు నాటికి గతేడాది తో పోల్చి చూస్తే గణనీయమైన వృద్ధి తో ముందుకు దూసుకెళ్తోంది. గతేడాది ఫిబ్రవరి నాటికి 425 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిన సింగరేణి, ఈ ఏడాది 40 శాతం వృద్ధి తో 595 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. గతేడాది ఫిబ్రవరి నాటికి సింగరేణి 442 టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి చేయగా ఈ ఏడాది అదే కాలానికి 33 శాతం వృద్ధితో 586 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించింది. ఓవర్ బర్డెన్ వెలికితీతలో కూడా కంపెనీ గతేడాది సాధించిన 288 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీపై 20 శాతం వృద్ధి తో 346 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అన్ని ఏరియాలు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో పోటాపోటీగా సత్తా చాటుతున్నాయి. గతేడాదితో పోల్చితే భారీ యంత్రాల వినియోగం, ఓఎంఎస్ కూడా గణనీయంగా పెరిగింది. దీంతోపాటు సింగరేణి థర్మల్ విద్యుత్ అమ్మకాల టర్నోవర్‌లో 19 శాతం వృద్ధిని సింగరేణి సాధించింది.

ఫిబ్రవరిలో 8,459 మిలియన్ యూనిట్ల విద్యుత్

మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా భారీ వృద్ధి రేటును నమోదు చేసింది. గతేడాది 6,703 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసిన ఈ కేంద్రం 26 శాతం వృద్ధి తో 8,459 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఫిబ్రవరి నెలలో ఉత్పత్తి చేసింది. కాగా, గతేడాది ఫిబ్రవరి నాటికి 2,964 కోట్ల రూపాయల విద్యుత్ అమ్మకాలు జరిపిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 19 శాతం వృద్ధి తో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 3,523 కోట్ల రూపాయల విద్యుత్ అమ్మకాలు జరపడం విశేషం. సింగరేణి వ్యాప్తంగా 8 చోట్ల ఏర్పాటు చేసిన సింగరేణి సోలార్ ప్లాంట్ల ద్వారా ఇప్పటి వరకు 239 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి జరిగింది. దీనిపై సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ సింగరేణి విద్యుత్ సంస్థల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే విధంగా పని చేస్తూ మరింత వృద్ధిని సాధించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News