Thursday, January 23, 2025

ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్న సింగరేణి

- Advertisement -
- Advertisement -

ఓడిశాలో మొదటి సారిగా సింగరేణి గని నైనీ

మన తెలంగాణ / హైదరాబాద్: సింగరేణి తెలంగాణకే పరిమితం కాకుండా, ఇతర రాష్ట్రాల్లోనూ బొగ్గు గనులు చేపట్టాలన్న రాష్ట్ర లక్ష్యంతో సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లోని లాభసాటియైన బొగ్గు బ్లాకులను చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో సింగరేణి సంస్థ ప్రతిపాదనల మేరకు కేంద్ర బొగ్గు మంత్రి త్వశాఖ ఒడిశా రాష్ట్రంలో నైనీ అనే లాభదాయకమైన బొగ్గు బ్లాకును కేటాయించింది. దీంతో సింగరేణి ప్రతినిధులు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను స్వయంగా కలిసి బొగ్గు తవ్వకాలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఒడిశా రాష్ట్రంలో సింగరేణికి కేటా యించిన నైనీ బొగ్గు బ్లాకులో 455 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. నైనీ బొగ్గు బ్లాకు నుండి ఏడాదికి 100 లక్షల టన్నుల బొగ్గు తీయడం కోసం ప్రణాళిక సిద్ధం చేసి అన్ని అనుమతులను ఇప్పటికే సంస్థ సాధించింది. అంతే కాకుండా ఇటీవలనే ఈ బొగ్గు గనికి సంబంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయంలో స్థానిక ప్రజలు తమ పూర్తి సానుకూలతను తెలిపారు.

ఈ ఏడాది చివరకు ఈ గని నుంచి 60 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనున్నారు. తర్వాత ప్రతి సంవత్సరం 100లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనున్నారు. పవర్ డంపర్, సర్వేస్ మైనర్ విధానం బొగ్గు తవ్వనున్న ఈ ఓపెన్ కాస్ట్ గనిలో మరో 1200 మంది ఔట్ సోర్సింగ్ మరో 1200 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉపాధి కల్పించ అవకాశం ఉంది. నైనీ బొగ్గు బ్లాక్ సంబంధించి స్టేజ్- 1, స్టేజ్-2 అనుమతులు సాధించడంలో సంస్థ ఉన్నతాధికారులు గని అనుమతులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసి సహకారం కోరారు. నైనీ బొగ్గు బ్లాకు నుండి ఉత్పత్తి అయిన బొగ్గును హండప్ప రైల్వే సైడింగ్ వరకు అక్కడ నుండి రైలు మార్గం ద్వారా రవాణాకు 6 పూర్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ నుంచి 60 లక్షల టన్నుల బొగ్గు, తల సంవత్సరాలలో ఏడాదికి 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News