Monday, December 23, 2024

మొక్కను నాటిన బలరాం నాయక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టినరోజు సందర్భంగా సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మొక్కను నాటారు. శనివారం జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్ లో ఆయన మొక్కను నాటారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ కరుణాకర్ రెడ్డి, సింగరేణి సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News