Wednesday, January 22, 2025

సింగరేణి సంస్థకు ఎనర్షియా అవార్డు ప్రదానం

- Advertisement -
- Advertisement -

సింగరేణి సంస్థ కు జాతీయస్థాయి లో అత్యుత్తమ పర్యావరణహిత మైనింగ్, సోలార్ ఉత్పాదక సంస్థగా ప్రతిష్టాత్మక ఎనర్షియా అవార్డును విశాఖపట్నంలో బహూకరించారు. ఎనర్షియా17వ పర్యావరణ మైనింగ్, సాంప్రదాయేతర ఇంధన వనరుల జాతీయస్థాయిలో ఇండియాస్ బెస్ట్ అండ్ మోస్ట్ సస్టైనబుల్ కోల్ మైనింగ్ అండ్ ఆపరేషన్ విత్ రెన్యువబుల్ ఎనర్జీ అనే అవార్డును కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ఛైర్మన్ ఘన్ శ్యామ్ ప్రసాద్ నుండి సింగరేణి సంస్థ సీఎండీ తరసున డైరెక్టర్ ఇ అండ్ ఎం. డి సత్యనారాయణ రావు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎస్ డి.ఎం సుభాని స్వీకరించారు.

శనివారం ఉదయం హైదరాబాద్ సింగరేణి భవన్ లో జీఎం (కో ఆర్డినేషన్) ఎస్ డి ఎం సుభాని ఈ అవార్డును సంస్థ ఛైర్మన్, ఎండి ఎన్ ఎన్ బలరామ్ కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ ఎన్. బలరామ్ మాట్లాడుతూ రామగుండంలో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు కు సిద్ధం కావడం, భారీ జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండటం, కార్బన్ డై యాక్సైడ్ నుంచి మిథనాలు తయారీ, భారీగా మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలకు గుర్తింపు లభించిందన్నారు. జాతీయస్థాయిలో ఈ అవార్డు రావడం ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుందని, ఇక ముందు కూడా సింగరేణి సంస్థ పర్యావరణహిత మైనింగ్ ను మరింతగా పెంపొందిస్తూ సోలార్ విద్యుత్తు కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News