Monday, January 20, 2025

కెటికె ఓసి3 గనిని తనిఖీ చేసిన సింగరేణి జిఎం

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: కెటికె ఓసి3 గనిని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ బళ్ళారి శ్రీనివాసరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 15 జూన్ 2023 నుండి బొగ్గు తవ్వకానికి కావాల్సిన ఓబి రిమూవల్ యొక్క పనులను నిర్వహించుటకు పొందిన రెండవ కాంట్రాక్టర్ యొక్క పని విధానాలను, వివిధ అంశాలను తనిఖీ చేశారు. అదేవిధంగా బొగ్గు వెలికితీతకు, డంపింగ్‌కు కావాల్సిన మిగులు సేకరణ పనులను త్వరితగతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారం, ప్రాజెక్టు ఆఫీసర్ రాజశేఖర్, మేనేజర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News