Monday, December 23, 2024

నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు

పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలోనే..

ఓటు హక్కు వినియోగించుకోనున్న 39,773 మంది ఉద్యోగులు

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం / సింగరేణి : అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన త రువాత తెలంగాణ రాష్ట్రం మరో ఎన్నికల స మరానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికలు బుధవారం జరగనున్నా యి. కాంగ్రెస్, సిపిఐ, బిఆర్‌ఎస్, బిజెపి అ నుబంధ సంఘాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగాయి. వాస్తవానికి ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఈ ఎన్నిక లు జరగాల్సి ఉండగా 2017 ఏడాదిలో ని ర్వహించిన అనంతరం రకరకాల కారణాల తో వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు న్యాయస్థానం కూడా అనుమతించడంతో బుధవారం పోలింగ్ జరుగనుంది.

మొత్తం 11 ఏరియాల్లో 39,773 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌కు అనుమతిస్తారు. అనంతరం రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ వెంటనే విజేతలను ప్రకటిస్తారు. పూర్తి గా బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

ఇప్పటికే గనులు, బొగ్గుబావులు, కార్యాలయాల వద్ద ప్రచార పర్వాన్ని కొనసాగించిన ప్రధాన సంఘాలు చివరి అంకంగా తాయిలాలు పంపకాలు కూడా పూర్తిచేశాయి. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. బిఆర్‌ఎస్ అనుబంధ యూనియన్ టిబిజికెఎస్ తొలుత ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించినప్పటికీ తరువాత ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాము కూడా బరిలో ఉన్నామని ప్రకటించడంతో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అనుబంధ యూనియన్ ఐఎన్‌టియుసి, సిపిఐ ఎఐటియుసి, బిజెపి అనుబంధ బిఎంఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News