Friday, November 22, 2024

పర్యావరణ పరిరక్షణకు సింగరేణి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: పర్యావరణ పరిరక్షణకు సింగరేణి పెద్దపీట వేస్తోందని సింగరేణి ఆర్జీ 1 జిఎం చింతల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది భాగంగా తెలంగాణ హరితోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆర్జీ 1 ఏరి యా సెంట్రల్ నర్సరీలో కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా జిఎం చింతల శ్రీనివా స్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌పి శశిధర్ రాజ్, చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ బి.హన్మంత రావు, టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు, సిఎంఓఎఐ అధ్యక్షులు పొనగోటి శ్రీనివాసులు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5.71కోట్ల మొక్కలను నాటామని, సింగరేణి సంస్థ ప్రతీ సంవత్సరం విరివిగా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షనకు ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. కోల్ బెల్ట్ ప్రాంతాంలో పచ్చదనాన్ని పెంచి, పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూజిఎం రాంమోహన్, డిజిఎం సివిల్ నవీన్, ఫారెస్ట్ అధికారి అభిలాష్, ఉన్నతాధికారులు రామ్మూర్తి, ఆంజనేయులు, ఆంజనేయప్రసాద్, శివ నారాయణ, రాజం, మదన్ మోహన్, బంగారు సారంగపాణి, నరేన్ చక్రవర్తి, దాసరి శ్రీనివాస్, వీరారెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News