Thursday, December 26, 2024

వరద ముంపు బాధితులకు అండగా నిలిచిన సింగరేణి సేవా సమితి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: వరద ముంపు బాధితుల సహాయార్థం ఊరట్టం, తాడ్వాయి మండల గ్రామ ప్రజలకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో భూపాలపల్లి సేవా సమితి అధ్యక్షురాలు బళ్ళారి మాధవి శ్రీనివాసరావు చేతుల మీదుగా గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులను, ప్రతి కుటుంబానికి రూ.500 చొప్పున 60 మంది వరద ముంపు బాధితుల కుటుంబాలకు శుక్రవారం అందించారు.

ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు బళ్ళారి మాధవి శ్రీనివాసరావు, లేడిస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ మణి, ఏరియా ఇన్‌చార్జి అధికార ప్రతినిధి బి శివకేశవరావు, డిప్యూటి పిఓం బి శ్యామ్ ప్రసాద్, సేవా సెక్రటరి లక్ష్మి, లేడిస్ క్లబ్ కమిటీ సభ్యులు, సేవా కోఆర్డినేటర్ కె ప్రవీణ్, సెక్యూరిటీ సిబ్బంది, సీనియర్ సేవా సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News