Thursday, December 26, 2024

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు బోనస్

- Advertisement -
- Advertisement -

27న కార్మికుల ఖాతాలో జమ
కానున్న రూ.18.27కోట్లు
ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 24
మధ్య పదవీ విరమణ చేసిన
2754 మందికి లబ్ధి ఒక్కొక్కరికి
గరిష్ఠంగా రూ.93,750 చెల్లింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి సంస్థలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1, 2024 నుంచి అక్టోబరు 24, 2024 మధ్యలో పనిచేసి రిటైరైన కార్మికులకు సంబంధించిన పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీమ్( దీపావళి బోనస్) సొమ్మును విడుదల చేస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ వెల్లడించారు. ఈనెల 27వ తేదీన వారి ఖాతాల్లో బోనస్ సొమ్ము జమ అవుతుందని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిటైరైన 2,754 మంది కార్మికులకు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్టంగా 93,750 రూపాయలు చొప్పున మొత్తం 18 కోట్ల 27 లక్షల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న రిటైర్డు కార్మికుల ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆయన ఆర్థిక, సిబ్బంది వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News