Monday, January 20, 2025

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్:  సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం విడుదల కావాల్సినప్పటికీ యాజమాన్యం విజ్ఞప్తితో నేటి సమావేశం వాయిదా పడింది. సెప్టెంబర్ 7వ తేఈదీ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించిన 9న స్క్రూటీని నిర్వహించి అదే రోజు ఎన్నికల్లో పోటీ చేసే యూనియన్ జాబితాను ఖరారు చేయాల్సి ఉంది.

అయితే యాజమాన్యం విజ్ఞప్తి మేరకు ఎన్నికలు వాయిదా పడటమే కాకుండా కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ తో కార్మిక సంఘాల భేటీ కూడా వాయిదా పడింది. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈనెల 22న సమావేశం అనంతరం షెడ్యూల్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.రెండు ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు పొందిన బిఆర్‌ఎస్ అనుబంధ యూనియన్ టిబిజిఎస్‌తో పాటు ఏఐటియుసి, ఐఎన్‌టియిసి ,సిఐటియు,బిఎంఎస్ , హెచ్‌ఎంఎస్,ఇప్టూ ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించకునేందుకు రంగంలోకి దిగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News