Thursday, December 26, 2024

సింగరేణిని ముంచింది కాంగ్రేస్సే

- Advertisement -
- Advertisement -

చేతగాక దద్దమ్మ కాంగ్రెస్ సగం వాటాను కేంద్రానికి ఇచ్చింది

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి/ములుగు జిల్లా ప్రతినిధి/పెద్దపల్లి ప్రతినిధి/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణికి ఏళ్ల చరిత్ర ఉందని, ఈ సంస్థను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నడపడం చేతకాక ముంచిందని బిఆర్‌ఎస్ పా ర్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకప్పుడు సింగరేణిలో వంద శా తం రాష్ట్రం వాటా ఉండేదని, ఇక్కడి కాంగ్రెస్ నాయకులు సమైక్య నాయకుల చేతిలో సింగరేణిని పెడితే కేంద్రం వద్ద రూ.600 కోట్ల మారిటోరియం తెచ్చి సింగరేణిలో49శా తం వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పిందే కాంగ్రెస్ పార్టీ అని సిఎం కెసిఆర్ చెప్పారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం ప్రసంగిస్తూ కాం గ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రామగుం డం నియోజకవర్గం పూర్తిగా సింగరేణి ప్రాంతమని కెసిఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా మాత్రమే ఎగరాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు, కార్మికుల కష్టంతో సింగరేణి సంస్థ రూ.2,200కోట్ల లాభాల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. కార్మికులకు 32శాతం లాభాల వాటా, దసరా, దీపావళి పండుగలకు మొత్తం రూ.1000 కోట్ల బోనస్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇది సింగరేణి చరిత్రలోనే మొదటిసారని సిఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలు పోగొడితే… తమ ప్రభుత్వం కొత్త నియమాకాలు చేపట్టడంతో పాటు వారసత్వ ఉద్యోగాలను తిరిగి కారుణ్య నియామకాల పేరిట పునరుద్ధరించి ఇప్పటి వరకూ 15వేల మందికి ఉద్యోగాలు కల్పించామని వివరించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జీర్ణించుకోలేకపోతుందని అన్నా రు. బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికులకు పెర్క్ మీద ఉన్న ట్యాక్స్ ఎత్తివేస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. గోదావరి పారే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు తాగు, సాగు నీటికి సైతం ప్రజలు కష్టాలు పడేవారని, కాళేశ్వరం ప్రాజెక్టుతో కేవలం ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తాగు, సాగునీటి కష్టాలను తీర్చామని సిఎం కెసిఆర్ అన్నారు. కంటి వెలుగు ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 80లక్షల మందికి కంటి అద్దాలను సైతం ఉచితంగా అందించామని తెలిపారు. ఆడబిడ్డ ప్రసూతి సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులను దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వ ఆసుపత్రిల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి, కెసిఆర్ కిట్, అమ్మాయి పుడితే 13 వేలు, అబ్బాయి పుడితే 12 వేలు అందిస్తూ పేదింటి ఆడబిడ్డలను అదుకున్నామని అన్నారు. రైతు బంధు ద్వారా దుబారా చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, రైతుబంధు పథకాన్ని తీసివేయాలాంటూ ప్రజలను సభా ముఖంగా ప్రశ్నించడంతో వద్దంటూ జనం సమాధానం ఇచ్చారు. మళ్లీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు కింద ఎకరానికి సంవత్సరానికి గాను 16వేలు ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. ఎద్దు, వ్యవసాయం అంటే ఎంటో తెలియని రాహుల్ గాంధీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నాడని, ధరణి తీసివేస్తే దళారీ వ్యవస్థ మళ్లీ పుడుతుందని, రైతులకు కష్టాలు మొదలవుతాయని సిఎం కెసిఆర్ అన్నారు. పార్టీ పాలసీలను చూసి ప్రజలు ఓట్లు వేసే పద్ధతి తెలంగాణలో రావాల్సిన అవసరం ఉందని అన్నారు. రామగుండం ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్ విన్నపం మేరకు కుర్జు, కమ్మి భూములకు హక్కులను కల్పించి సర్టిఫికేట్లను అందజేశామని అన్నారు. కోరుకంటి చందర్ ఉద్యమ కారుడని, ఉద్యమ సమయంలో 74 రోజులు జైల్లో ఉన్నాడని, అంతేగాకుండా ఆయన సింగరేణి కార్మికుని బిడ్డని, సింగరేణిపై చందర్ అవగాహన ఉందని, చందర్‌ను గెలిపిస్తే ఈ ప్రాంతం ప్రజలకు లాభం చేకూరుతుందని, అనువుగా ఉండే పరిశ్రమలను అన్నింటినీ తెప్పిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. ఈ సభలో పెద్దపల్లి ఎంపి వెంకటేశ్, మాజీ స్పీకర్ మధుసూదనచారి, మాజీ ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్ రావు, మేయర్ డా. అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, టిబిజికెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితరులున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారుల, పైరవీకారుల రాజ్యం…
భూపాలపల్లి : కడుపులో చల్ల కదలకుండా, ఎవరికి లంచం ఇవ్వకుండా బ్యాంకుల్లో నేరుగా రైతుబంధు డబ్బులు వచ్చి చేరుతున్నాయి, అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారుల, ఫైరవీకారుల రాజ్యం గ్యారెంటీగా వస్తాది, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సిఎం కెసిఆర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాదసభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకున్నామని తెలిపారు. పేదల సంక్షేమం కోసం పెన్షన్లు, కల్యాణలక్ష్మీ పథకం వంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పేదలకు ఇస్తున్న పెన్షన్ రూ.3 వేల నుంచి 5వేలకు పెంచుకుందామని స్పష్టం చేశారు. కాలువల ద్వారా నీరు అందిస్తే పన్ను వేస్తారు, కానీ తెలంగాణలో రద్దు చేసినట్లు తెలిపారు. “కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరు చేయాలంటే చేస్తారా, సాధ్యం అవుతుందా?” అని కెసిఆర్ ప్రశ్నించారు. ఎవరైతే ప్రజల పక్షనా పోరాడుతారో వారి చేతుల్లో కత్తి పెడితే గ్యారెంటీగా మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తారట, మరి రైతుబంధు డబ్బలు ఎలా రావాలి, ఎలా ఇవ్వాలాన్నరు. ధరణి తీసేసీ పాత పద్ధతి తెస్తే రైతు బంధు డబ్బులు ఏలా వస్తాయి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యంలో తిరిగి దళారుల రాజ్యం వస్తుందని ఆరోపించారు. రైతులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే నష్టపోతాం, పెద్ద ప్రమాదం జరుగుతుందని సిఎం కెసిఆర్ హెచ్చరించారు.
10 ఏళ్ల అభివృద్ధి చూసి ఓటు వేయాలి…
ములుగు : ములుగు నియోజవర్గ ఎంఎల్‌ఎ అభ్యర్థ్ధి బడే నాగజ్యోతిని గెలిపిస్తే ములుగు వెలుగుతుందని, ఓటు వజ్రాయుధం వంటిదని, పదేళ్ల రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ముఖ్య పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని తొమ్మిదిన్నర ఏళ్లలో ప్రత్యేక రాష్ట్రంలో సాధించుకున్నామని అన్నారు. ఎన్నికలు చాలా చూశామని, మాయమాటలు చెప్పటానికి వస్తుంటారని వాళ్ల కళ్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. బిఆర్‌ఎస్ పుట్టింది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అన్నారు. తెలంగాణ ప్రత్యేక సాధన కోసం మేడారం సమ్మక్క, సారలమ్మలకు ఎన్నోసార్లు బంగారం సమర్పించుకున్నానన్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా 5 గుడిసెలకు కూడా మంచినీళ్లు ఇస్తున్న ఘనత బిఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. పొలాలకు నీటి తీరువా రద్దు చేశాం, పాత బకాయిలు రద్దుచేశామన్నారు. 24 గంటలు కరెంట్ దండగ అని 3 గంటలు ఇస్తేచాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నాడని, 10 హెచ్‌పి మోటర్లతో 3 గంటలతో నీళ్లు పారించవచ్చని అర్ధంలేని మాటలు మాట్లాడుతున్నాడని, ఓకేసారి 10 హెచ్‌పి మోటార్లతో ఆన్‌చేస్తే ట్రాన్స్‌ఫార్మర్లు టపాసులవలే పేలిపోతాయని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపామని, 48వేల 160 ఎకరాల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశామని, వాటిపై ఉన్న కేసులు కూడా ఎత్తివేశామని, పట్టాభూములకు రైతు బంధు, రైతుభీమా కూడా కల్పించామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అని కాంగ్రెసోళ్లు అంటున్నారని ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎన్‌కౌంటర్లు, ఎమర్జెన్సీలు తప్పా ఏముండవని అన్నారు. పేద ప్రజలకోసం ఉద్యమాల బాట పట్టిన బడే నాగేశ్వరరావు ప్రజా సమస్యల కోసం ఉద్యమంలో అమరుడయ్యాడని ఆయన బిడ్డ ప్రజల సమస్యలు తీర్చడానికి వచ్చిండని, ప్రజల పక్షాన ఉండి కొట్లాడే వ్యక్తి అని, ప్రజలు ఆశీర్వదించి బడే నాగజ్యోతిని గెలిపిస్తే ములుగు మరింత అభివృద్ధితో వెలుగుతుందన్నారు. ములుగులో మెడికల్ కాలేజి ఏర్పాటు చేశామని, మెడికల్ కళాశాల ద్వారా 450 పడకల ఆసుపత్రి వస్తుందని, నర్సింగ్ కళాశాల వస్తుందని తెలిపారు. ఎంఎల్‌ఎ తన నియోజవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవాలని, ములుగు ఎంఎల్‌ఎ సీతక్క తనను ఎప్పుడూ ఇక్కడి సమస్యలపై కలవలేదన్నారు. గతంలో ప్రచారానికి ఇక్కడికి వచ్చి జిల్లా చేస్తానని మాట ఇచ్చానని, అయినా ప్రజలు ఇక్కడి అభ్యర్థ్ధిని ఓడించారని ఇచ్చిన మాట కోసం సిఎం కాగానే జిల్లా ఏర్పాటు చేశానని తెలిపారు. ఎంఎల్‌ఎ అభ్యర్థ్ధి బడే నాగజ్యోతి కష్టపడి చదువుకున్న వ్యక్తని ఆమెను గెలిపిస్తే ములుగు నియోజకవర్గంలో రెండు రోజులు క్యాంప్ వేసుకుని ఇక్కడి సమస్యలను పరిష్కరిస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ గెలిస్తే పేకాట క్లబ్బులు వస్తాయి…
మంచిర్యాల (నస్పూర్) : కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంచిర్యాల నిండా పేకాట క్లబ్బులు వెలుస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులే ఉంటాయని, ఇక కొదవ ఉండదన్నారు. మంచిర్యాల పట్టణంలో గల్లీగల్లీలో పేకాటరాయుళ్లే జమైతరని, మీ బంగారు భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని సీఎం హితవు పలికారు. కాంగ్రెస్‌వాళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, బిఆర్‌ఎస్‌లో జాయిన్ అవుతామని ఆ పార్టీ ఎంఎల్‌ఎ అభ్యర్థ్ధులు అంటున్నారని, అదంతా అవాస్తవం అన్నారు. మంచిర్యాలలో దివాకర్‌రావు గెలిస్తే లాభం జరుగుతుందని, దివాకర్‌రావు నన్ను ఎప్పుడు వ్యక్తిగత పనులు అడగలేదని, పొలాలకు నీళ్లు రావాలని, లిఫ్టులు కావాలని, గోదావరిపై కరకట్ట కట్టి మంచిర్యాలకు వరద నీరు రాకుండా చూడాలని అడిగేవారని, ఆ బాధ్యత నాది అని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. అవసరమైతే ఎండాకాలంలో పనులు మొదలు పెట్టి శరవేగంగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News